![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -795 లో.... రాజ్ ఉన్నాడని రేవతి ఫోన్ చెయ్యగానే కావ్య వెళ్తుంది. ఏంటి అలా వెళ్తుంది.. మళ్ళీ రాజ్ కి ఏమైనా అయిందా ఏంటని రుద్రాణి అంటుంది. అదేం నోరు ఎప్పుడు ఏదో వాగుతునే ఉంటావని ఇందిరాదేవి రుద్రాణిపై కోప్పడుతుంది. రాజ్ ఉన్నాడని తెలిసింది అందుకే కావ్య వెళ్ళిందనగానే.. ఒక రుద్రాణి, రాహుల్ తప్ప అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి రాజ్ దగ్గరికి కావ్య వెళ్ళింది.. ఇప్పుడు రాజ్ ని తీసుకొని వచ్చి అతనికి నిజం చెప్పేలా ఉన్నారని చెప్తుంది. అలా ఎలా జరగనిస్తానని యామిని అంటుంది. మరొకవైపు రేవతి దగ్గరికి కావ్య వెళ్తుంది. నువ్వు రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావట కదా బాధపడుతున్నాడు.. రాజ్ కి చిన్న ఆక్సిడెంట్ అయిందని రేవతి చెప్తుంది. కావ్య లోపలికి వెళ్లేసరికి రాజ్ కి తలకి కట్టుకట్టి ఉంటుంది. కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంటే మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న ఎందుకు అలా మాట్లాడరని రాజ్ అంటాడు. ఇంట్లో అందరు మీ గురించి బాధపడుతున్నారు అందుకే తీసుకొని వెళ్లాడానికి వచ్చానని కావ్య అంటుంది. రానని రాజ్ అంటాడు. అయినా వినకుండా బలవంతంగా రాజ్ ని లాక్కొని తీసుకొని వెళ్తుంది కావ్య.
ఆ తర్వాత రాజ్ రాగానే ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్ నేను మీ కుటుంబంలో ఒకడిగా అవ్వాలని ఉంది కానీ అది కళావతి గారితోనే సాధ్యం అవుతుందని రాజ్ అంటాడు. అప్పుడే యామిని వచ్చి.. బావ నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు.. రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఏంటని కావ్యని యామిని అడుగుతుంది. తరువాయి భాగంలో కావ్యకి నువ్వు అంటే ఇష్టం లేదు బావ అని యామిని అనగానే ఉంది కానీ దాస్తున్నారు ఎందుకో రీజన్ తెలుసుకుంటానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |